AP: పార్వతీపురం మన్యం జిల్లాలో ఓ పాము కలకలం రేపింది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలల సత్వర చికిత్స కేంద్రంలోకి ఆదివారం అకస్మాత్తుగా ఒక త్రాచుపాము దూసుకొచ్చింది. ఆస్పత్రిలోకి వచ్చిన పామును చూసి, అక్కడ ఉన్న రోగులు భయపడి పరుగులు తీశారు. ఈ క్రమంలో అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది పామును చంపేశారు. దీంతో రోగులు, సిబ్బంది ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.