AP: తిరుమల దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు కొండపై నాణ్యమైన ఆహారం అందించేందుకు ప్రసిద్ధ బ్రాండెడ్ హోటళ్లను ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో టెండర్లు ఆహ్వానించేందుకు ఇప్పటికే లైసెన్సింగ్ విధి విధానాలు కూడా ఖరారు చేసినట్లు తితిదే ఎస్టేట్ అధికారి వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు.