లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా విమాన గోపురానికి బంగారు తాపడం చేయించాలని 2021లో అప్పటి సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అనేక మంది భక్తులు, దాతలు విరాళాలు ఇచ్చినా తాపడం పనులు చేపట్టేందుకు అవసరమైన బంగారం సమకూరలేదు. ఆ తర్వాత 2022 మార్చి 8న కేసీఆర్ ఆలయ ఉద్ఘాటన పూర్తి చేశారు. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట అభివృద్ధిపై దృష్టి సారించారు.