గుండెపోటుతో ఓ వ్యక్తి నడుస్తూనే కుప్పకూలగా.. పోలీసులు సమయస్ఫూర్తితో సీపీఆర్ చేసి ఓ నిండు ప్రాణాన్ని బతికించిన ఘటన ఎన్టీఆర్ జిల్లా నందిగామలో జరిగింది. నందిగామ అశోక్ నగర్‌కు చెందిన ఆర్టిసీ డ్రైవర్ రమేష్ డ్యూటీకు బయలుదేరారు. అయితే రోడ్డుపై నడుస్తుండగా ఆకస్మాత్తుగా రమేష్ సృహ కోల్పోయి పడిపోయాడు. సృహ కోల్పోయిన రమేష్‌కు సమీపంలో ఉన్న పోలీసులు సీపీఆర్ చేశారు. అనంతరం హాస్పటల్‌కు తరలించి ప్రాణాన్ని కాపాడారు.