బర్డ్ ఫ్లూ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో చికెన్, గుడ్ల అమ్మకాలు పడిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రజల్లో భయం పోగొట్టేందుకు యజమానులు ఉచితంగా చికెన్ పంపిణీ చేస్తున్నారు. తెలంగాణలోని సిద్దిపేటలోనూ ఆదివారం ఫ్రీ చికెన్ మేళా నిర్వహించగా, ప్రజలు ఎగబడ్డారు. ఈ సందర్భంగా 200 కేజీల చికెన్ ఫ్రై 2,000 ఉడకబెట్టిన గుడ్లను పంపిణీ చేశారు.