వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి శుక్రవారం రాత్రే విడుదల కావాల్సి ఉంది. అయితే కోర్టు నుంచి ఆర్డర్ కాపీలు స్టేషన్‌కు చేరేసరికి సమయం మించిపోవడంతో నిబంధనల మేరకు పిన్నెల్లిని జైలు అధికారులు రిలీజ్ చేయలేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు శనివారం ఉదయం పిన్నెల్లి బెయిల్‌పై విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.