ప్రయాణికులను విమాన సంస్థలు దోచుకుంటున్నాయి: సీపీఐ నారాయణ

68చూసినవారు
ప్రయాణికులను విమాన సంస్థలు దోచుకుంటున్నాయి: సీపీఐ నారాయణ
ప్రయాణికులను విమాన సంస్థలు దోచుకుంటున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. విమాన టికెట్ల ధరలపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు ఆయన లేఖ రాశారు. మౌలిక సదుపాయాలు ప్రభుత్వం కల్పిస్తే ప్రైవేట్ విమానయాన సంస్థలు అడ్డగోలుగా రేట్లు పెంచుతున్నాయని అన్నారు. ప్రయాణ దూరం మారనప్పుడు టికెట్ ధరలు ఎలా పెంచుతారని ప్రశ్నించారు. సామాన్య ప్రజలను దృష్టిలో ఉంచుకొని టికెట్ రేట్లను నియంత్రించాలన్నారు.

సంబంధిత పోస్ట్