ఏపీ అసెంబ్లీలో మంగళవారం నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ఉదయం 10 గంటలకు ప్రసంగిస్తారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి పూర్తి బడ్జెట్ సమావేశాలు ప్రస్తుతం జరగనున్నాయి. మరోవైపు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీకి హాజరుకానున్నారు. దీంతో సభలో అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేల మధ్య జరిగే మాటల యుద్ధంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.