AP: రూ.3.24 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్‌కు సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలోని కేబినెట్ శుక్రవారం ఉదయం ఆమోదం తెలిపింది. కాసేపట్లో మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. అంతకుముందు ఆయన వెంకటాయపాలెంలోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లారు. బడ్జెట్ ప్రతులను స్వామి వారి పాదాల వద్ద ఉంచి పూజలు చేయించారు. అనంతరం వాటిని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు అందజేశారు.