AP: కుంభమేళాలో పూసలమ్ముతూ మోనాలిసా పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఆ ప్రభావంతోనే కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం సీహెచ్ గున్నేపల్లిలో జరిగిన సత్తెమ్మతల్లి తీర్థంలో పూసలు అమ్ముకుంటున్న బాలికను సత్తి దేవిశ్రీప్రసాద్ అనే యువకుడు వీడియో తీసి.. ఇన్‌స్టాలో ‘కోనసీమ మోనాలిసా’ అంటూ పోస్ట్ చేశాడు. ఈ వీడియో వైరలయింది. పదో తరగతి చదువుతున్న ఆ బాలికను తోటి విద్యార్థినులు ఎగతాళి చేయడంతో మనస్థాపానికి గురైంది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.