AP: గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీతానగరం పుష్కర ఘాట్ వద్ద ప్రేమ జంటలు రెచ్చిపోయాయి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డాయి. శివరాత్రి సందర్భంగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తుండగా.. ప్రేమికులు ముద్దులు పెడుతూ రెచ్చిపోయారు. ప్రేమికులపై స్థానికులు మండిపడుతున్నారు. పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.