GOOD NEWS: లక్ష మందికి ఉచితంగా కుట్టు మిషన్లు

68చూసినవారు
GOOD NEWS: లక్ష మందికి ఉచితంగా కుట్టు మిషన్లు
AP: పేదింటి మహిళలకు చంద్రబాబు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. 2024-25 సంవత్సరానికి బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గానికి చెందిన లక్ష మంది పేద మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లను పంపిణీ చేయనుంది. అలాగే వారికి శిక్షణ కూడా ఇవ్వనుంది. తొలి విడతగా 26 జిల్లాల పరిధిలోని 60 నియోజకవర్గాల్లో కుట్టు మిషన్లు పంపిణీ చేయనుంది. రెండు రోజుల్లో గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. మరో 10 రోజుల్లో శిక్షణ కేంద్రాలు ప్రారంభించేలా ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది.

సంబంధిత పోస్ట్