మహా కుంభమేళాలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. 36 ఏళ్ల తర్వాత ఓ మహిళ తన స్నేహితుడిని కలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లక్నోకు చెందిన రష్మీ గుప్తా మహా కుంభమేళాకు వెళ్లారు. అయితే అక్కడ పోలీసుగా విధులు నిర్వహిస్తున్న సంజీవ్ అనే అతను రష్మీ గుప్తాను గుర్తు పట్టి పలుకరించాడు. ఈ క్రమంలో ఇద్దరు ఒకరినొకరు పలుకరించి ఆశ్చర్యానికి గురయ్యారు.