AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పోసాని కృష్ణమురళిపై కేసులు నమోదయ్యాయి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, లోకేశ్‌ను అసభ్యకరంగా దూషించారని అనంతపురం, బాపట్ల, నరసరావుపేట, చిత్తూరు, తిరుపతి, మన్యం, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో ఫిర్యాదు అందాయి. రెండు రోజుల క్రితం అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పీఎస్‌లో నమోదైన కేసులో పోసానిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోసానిపై 111, 196, 353, 299, 366 (3)(4), 341, 61(2) బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.