తెలంగాణ పోలీస్ శాఖలో వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఉద్యోగ ఒత్తిళ్లకు తోడు, వ్యక్తిగత పరిస్థితులు బాధించడంతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ప్రేమ వైఫల్యంతో కొందరు, కుటుంబ సమస్యలతో మరికొందరు తనువు చాలిస్తున్నారు. ఇలా తెలంగాణలో కేవలం 14 నెలల్లో ముగ్గురు SIలు, నలుగురు హెడ్ కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డు, 14 మంది కానిస్టేబుళ్లు ఆత్మహత్య చేసుకున్నారు.