ఎదురుదెబ్బ తగిలి గోరు చిట్లితేనే ప్రాణం పోయినట్లు విలవిల్లాడిపోతాం. కూరలు కోసేటప్పుడు పొరపాటున వేలు తెగితే అల్లాడిపోతాం. ఏ జబ్బో వచ్చి కొన్నాళ్లు మంచంమీద గడపాల్సి వస్తే ’నాకే ఎందుకిలా’ అని వాపోతాం. అలాంటిది ఉన్నట్టుండి ఏం జరుగుతుందో తెలియదు.. నిండు ప్రాణాన్ని నిమిషంలో తీసేసుకుంటారు. అసలు బాధల్లేని మనిషెవరు ఈ భూమ్మీద. అందరికీ ఏదో ఒక స్థాయిలో సమస్యలుంటాయి. తట్టుకుని నిలబడడమే కదా జీవితం.