ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతున్నా, చీటికీ మాటికీ చిరాకు పడుతున్నా, దినచర్యలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నా, ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నా, తనకిష్టమైన వస్తువుల్ని ఎవరికైనా ఇచ్చేస్తున్నా... ఏదో తేడా ఉందని గుర్తించాలి. వారిని ఒంటరిగా వదలకూడదు. నెమ్మదిగా నచ్చజెబుతూ సమస్య నుంచి బయటపడేలా చూసుకోవాలి. ఆత్మహత్యాయత్నం చేసి విఫలమైతే ఇక దాని జోలికి వెళ్లరనుకోవద్దు. అలాంటి వారిని మళ్లీ మళ్లీ ఆ ఆలోచనలు వెంటాడుతాయి.