ఆ ఆలోచన ఉన్నవారి ప్రవర్తనలో కన్పించే సంకేతాలను గుర్తించగలగాలి. ఆ ఆలోచనలు ఒకసారి వస్తే వాటంతటవి పోవు. తప్పనిసరిగా కుటుంబసభ్యుల, మానసిక నిపుణుల సహాయం కావాలి. మాటల్లో తరచూ చావు ప్రస్తావన తెస్తుంటే- ఏమాత్రం తేలిగ్గా తీసుకోవద్దు. వారి మనసులో ఏదో ఆలోచన ఉంటేనే అలా మాట్లాడతారు. వారి కష్టమేమిటో తెలుసుకుని ధైర్యం చెప్పాలి.