2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని 150 మంది పోలీసు సిబ్బందిపై జరిపిన అధ్యయనంలో వారిలో మూడో వంతు మంది మానసిక వేదనతో బాధపడుతున్నారని కనుగొన్నారు. సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్' 2020లో 21 రాష్ట్రాలలో నిర్వహించిన ఒక సర్వేలో పని భారం, పని-జీవితంలో సమతుల్యత సరిగ్గా లేకపోవడం, వనరుల కొరత కారణంగా పోలీసు సిబ్బంది ఒత్తిడికి లోనవుతున్నారని తేలింది. 30% కంటే ఎక్కువ మంది తమ వృత్తిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.