ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళ బచేంద్రీ పాల్. 1984లో పద్మ శ్రీ పురస్కారం అందుకున్నారు. 1985లో ఇండో- నేపాలీ మహిళలతో కలిసి ఎవరెస్ట్ సాహస యాత్ర చేపట్టి, 7 ప్రపంచ రికార్డులు సృష్టించారు. భారత మహిళా సాహస యాత్రికులకు మార్గదర్శకురాలిగా నిలిచారు. హరిద్వార్ నుంచి కలకత్తా వరకు 2,500 కి.మీ. మేర గంగా నదిలో యాత్ర సాగించిన రాఫ్టింగ్ బృందానికి నాయకత్వం వహించారు.