ఏపీ ఎన్నికల వేళ సీఈవో కీలక సూచనలు

83చూసినవారు
ఏపీ ఎన్నికల వేళ సీఈవో కీలక సూచనలు
ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఈసీ సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో శుక్రవారం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) ముఖేష్ కుమార్ మీనా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఎన్నికల ప్రచారం, బహిరంగ సభల నిర్వహణ, హెలికాప్టర్ల వాడకం, ఎన్నికల వ్యయం వంటి అంశాలపై కీలక సూచన చేశారు. రూ.50 వేలకు మించి నగదు, రూ.10 వేలకు మించి విలువైన వస్తువుల రవాణా చేయొద్దన్నారు.

ట్యాగ్స్ :