తొలిరోజులు… సాహిత్య సేద్యం

79చూసినవారు
తొలిరోజులు… సాహిత్య సేద్యం
శ్రీశ్రీ ప్రాథమిక విద్యను విశాఖలోని శివరామయ్య పాఠశాలలో పూర్తిచేశారు. హైస్కూలు విద్యను మిసెస్ AVN కాలేజీ అనుబంధ పాఠశాలలో అభ్యసించారు. హైస్కూలు దశలోనే శ్రీశ్రీ ‘వీరసింహ విజయసింహులు’ అనే కథను, ‘సావిత్రి సత్యవంతం’ అనే పద్యనాటికను, ‘పరిణయ రహస్యం’ అనే నవలికను, ‘గోకులాయ్’ అనే డిటెక్టివ్ నవలను రాశారు. అలా వైవిధ్య రచనలతో బాలకవిగా పేరు తెచ్చుకున్నారు. 1920లో పురిపండా అప్పలస్వామి శ్రీశ్రీ రాసుకున్న కవితలను ‘దివ్యలోచనములు’ పేరుతో తన పత్రికలో అచ్చువేశారు.

సంబంధిత పోస్ట్