విశాఖలో జన్మించిన శ్రీశ్రీ

72చూసినవారు
విశాఖలో జన్మించిన శ్రీశ్రీ
తెలుగు కవిత్వాన్ని మలుపు తిప్పిన శ్రీరంగం శ్రీనివాసరావు 1910 ఏప్రిల్ 30న విశాఖపట్నంలో జన్మించారు. తండ్రిపేరు పూడిపెద్ది వెంకట రమణయ్య, తల్లి ఆప్పలకొండ. శ్రీశ్రీ తండ్రిని శ్రీరంగం సూర్యనారాయణ అనే దగ్గరి బంధువు దత్తత తీసుకోవడంతో ఇంటిపేరు శ్రీరంగంగా మారింది. శ్రీశ్రీ నెలలవయసులో ఉండగా పెద్ద జబ్బుచేసింది. వరసకు మామయ్య అయిన శివప్రసాదం శ్రీశ్రీ నుదుట చుట్టతో కాల్చారట. శ్రీశ్రీకి ఏడాదిన్నర వయసులో తల్లి కాలం చేశారు. తండ్రి సుభద్రమ్మను ద్వితీయ వివాహం చేసుకున్నారు. ఆమె ఆలన, పాలనలోనే శ్రీశ్రీ పెరిగారు.

సంబంధిత పోస్ట్