AP: చేతకాని పాలనకు సీఎం చంద్రబాబే ట్రేడ్ మార్క్ అని వైసీపీ ఆరోపించింది. ఇన్నేళ్లుగా ప్రజలను దగా చేస్తూ వస్తున్నారని వైసీపీ విమర్శించింది. బెజవాడ ప్రజలను వరదల్లో ముంచేశారని తెలిపింది. ఈ సారి కూడా ప్రజలను హామీల పేరుతో వంచించాడని, సూపర్ సిక్స్‌ను అటకెక్కించాడని పేర్కొంది. ఏనాడూ చంద్రబాబు తన మాట నిలుపుకోలేదని వైసీపీ చెప్పుకొచ్చింది. ఆయనొక దండమారి పాలకుడని సోమవారం ఎక్స్‌లో వైసీపీ ట్వీట్ చేసింది.