TG: డిగ్రీ విద్యార్థినిపై పట్టపగలు ఓ ప్రేమోన్మాది కత్తితో దాడి చేసిన దారుణ ఘటన మెదక్లో సంచలనంగా మారింది. ఓ యువతి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓపెన్ డిగ్రీ చదువుతోంది. అయితే చేతన్ అనే యువకుడు ప్రేమించమని ఆమె వెంట పడేవాడు. ఈ క్రమంలో యువతి పరీక్షలు రాసేందుకు కాలేజీకి రాగా ఒక్కసారిగా కత్తితో దాడి చేసి పరారయ్యాడు. స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.