కార్తీకమాసం తొలి సోమవారం కావడంతో రెండు తెలుగు రాష్ట్రాలలోని శైవ క్షేత్రాలు భక్తులతో రద్దీగా మారాయి. వేకువజాముననే ప్రధాన ఆలయాల్లోని కోనేర్లలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. ప్రధాన ఆలయాల్లో స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. నవంబర్ 2 నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకు కార్తీక మాసోత్సవాలు ఘనంగా జరగనున్నాయి.