జగనన్న విద్యాంధ్రప్రదేశ్ కోసం పని చేస్తే.. చంద్రబాబు రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారని వైసీపీ కీలక నేత ఆర్కే రోజా మండిపడ్డారు. సంతలో మద్యం అమ్ముతున్న వీడియోను ఆమె షేర్ చేశారు. 'ఏపీలో బెల్టుషాపులను ఎలా నిర్వహిస్తున్నారో చూడండి. చిన్న పిల్లల్ని, విద్యార్థులని పెట్టి మద్యం అమ్మిస్తున్నారు. తణుకులో ఇలా విచ్చలవిడిగా మద్యం బెల్టు షాపులు వెలిశాయి. ఇదేనా మంచి ప్రభుత్వం?' అని రోజా ప్రశ్నించారు.