మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర సీఎం, శివసేన అధ్యక్షుడు ఏక్నాథ్ షిండే తన నామినేషన్ దాఖలు చేశారు. కోప్రీ పాచ్పాఖాడీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆయన సోమవారం తన నామినేషన్ను స్థానిక ఎన్నికల అధికారికి సమర్పించారు. శివసేన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. డిప్యూటీ సీఎం దేవంద్ర ఫడ్నవీస్ కూడా ఆయనతో పాటు ఉన్నారు.