AP: తిరుపతి తొక్కిసలాట ఘటనకు సీఎం చంద్రబాబు బాధ్యత తీసుకోవాలని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించని అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. తమ హయాంలో తిరుమల అపవిత్రమైందని, లడ్డూలో ఆవు కొవ్వు కలిపినట్లు దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. ఆ మాటల వల్లే దేవుడు కళ్లు తెరిచాడని, ఇలాంటి దుర్ఘటన జరిగిందని వ్యాఖ్యానించారు.