తన కామెడీతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు నటుడు వైవా హర్ష. అయితే, తాజాగా హర్ష తన ఇన్‌స్టాలో ఓ ఎమోషనల్ వీడియో షేర్ చేశారు. ‘హాయ్.. నేను మీ అందరిని ఒక సహాయం అడగడానికి ఈ వీడియో చేస్తున్నాను. నేను, నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ బాధలో ఉన్నాం. మా అంకుల్ ఏ.పాపరావు (91) నాలుగు రోజుల క్రితం వైజాగ్‌లో ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఆయనకి అల్జీమర్స్ కూడా ఉంది. ఎవరికైనా కనిపిస్తే ఈ నెంబర్స్‌కి చెప్పండి’ అని అన్నారు.