నమీబియాలో నెలకొన్న తీవ్ర కరువును తొలగించడానికి జంతువులను వధించేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో గుజరాత్‌లోని వంతారా వన్యప్రాణి సంక్షేమ, సంరక్షణ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. జంతువుల సంరక్షణకోసం చర్యలు చేపట్టే అవకాశం తమకు కల్పించాలని భారత్‌లోని ఆ దేశ కమిషనర్‌కు లేఖ రాసింది. జంతువుల బలిని ఆపేందుకు తమ వద్ద ఉన్న సంరక్షణ కేంద్రాల్లో.. వాటికీ ఆశ్రయం కల్పించనున్నట్లు పేర్కొంది.