స్కామ్ 1992, ది ఫ్యామిలీ మ్యాన్ మరియు ఇతర ప్రాజెక్ట్‌లతో పేరుగాంచిన బాలీవుడ్ నటి శ్రేయా ధన్వంతరి ఇటీవల ముంబైలో ఇల్లు కొనడం "స్కామ్" అని పేర్కొంది. ‘‘ముంబైలో ఇల్లు కొనడం పెద్ద స్కామ్.. దాన్ని ఖచ్చితంగా చెప్పగలను. అక్కడ ఇళ్లు కొనాలనుకోవడం మూర్ఖత్వం, ఖరీదైన కల. ఆ ఉచ్చులో పడకండి. కేవలం ఇంటిని రెంటు తీసుకోండి’’ అని ట్వీట్ చేసింది. ఆమె అభిప్రాయాన్ని Xలో పంచుకున్న వెంటనే, నెటిజన్లు ఆమెతో ఏకీభవించారు.