చంద్రగిరి: సీఎం పర్యటన పై అధికారులతో సమీక్ష
సంక్రాంతి పండుగకు నారావారిపల్లెకి సీఎం చంద్రబాబు రానున్న సందర్భంగా మౌలిక వసతుల ఏర్పాట్లపై చంద్రగిరి ఎమ్మెల్యే నాని గురువారం సాయంత్రం అధికారులతో సమీక్ష నిర్వహించారు. పోలీసు బలగాలు ఉండడానికి వసతి ఏర్పాట్లపై చర్చించారు. చంద్రబాబు ఇంటి మరమ్మతులు, గ్రామాల్లో విద్యుత్ దీపాల ఏర్పాటుపై ఆరా తీశారు. భీమా నదిపై వరదలకు కొట్టుకుపోయిన వంతెనల నిర్మాణ పనులను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు తెలిపారు.