పుత్తూరు పట్టణంలోని నారాయణ పాఠశాలలో ఆదివారం ఘనంగా గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏజీఎం కిషోర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యతోనే ఉన్నత స్థానాలకు వెళ్ళవచ్చని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ తిరు, ఆర్ ఐ కిరణ్, వైస్ ప్రిన్సిపల్స్ ప్రియా, సుబిత కోఆర్డినేటర్ ద్రాక్షాయని, వరలక్ష్మి, సుదర్శన్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.