పుత్తూరు: అండర్ బ్రిడ్జి నీటితొ తప్పని ఇబ్బందులు
నగిరి నియోజకవర్గం, పుత్తూరు మున్సిపాలిటీ పట్టణంలోని పాత పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ఎంబి రోడ్డు వద్ద గల అండర్ బ్రిడ్జ్ వాహనదారులకు శాపంగా మారిందని స్థానికులు తెలిపారు. ఇటీవల కురిసిన వర్షానికి నీటి నిల్వచేరి దుర్గంధ భరితంగా మారిందని స్థానిక ప్రజలు సోమవారం చెప్పారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి నీటిని తొలగించాలని, అదేవిధంగా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఆలోచించాలని కోరుతున్నారు.