స్పృహ తప్పి పడిన వ్యక్తి మృతి

1871చూసినవారు
స్పృహ తప్పి పడిన వ్యక్తి మృతి
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం దిగవపల్లిలో వెలిసిన బోయకొండ గంగమ్మ ఆలయానికి పుంగనూరు మండల పరిధిలోని ఏటవాకిలి గ్రామానికి చెందిన మల్లికార్జున రెడ్డి(45 ) కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం అమ్మవారి దర్శనానికి క్యూ లైన్ లో వెళుతుండగా ఒక్కసారిగా కుప్ప కులాడు. వెంటనే గమనించిన తోటి భక్తులు , వైద్య సిబ్బంది 108 లో మదనపల్లె ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.