పుంగనూరు: ఆలయాలకు భారీగా పోటెత్తిన భక్తులు
పుంగనూరు నియోజకవర్గంలోని వైష్ణవాలయాలకు శుక్రవారం భక్తులు భారీగా తరలి వెళ్తున్నారు. ఇసుక వేస్తే రాలనంత జనం ఆలయాలకు వెళ్లి స్వామి వారిని దర్శించుకుంటున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయాలలో నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణమంతా మారుమోగుతుంది.