చంద్రగిరి: బంగారు తిరుచ్చిపై కల్యాణ వెంకన్న అభయం

73చూసినవారు
చంద్రగిరి: బంగారు తిరుచ్చిపై కల్యాణ వెంకన్న అభయం
చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురంలో వెలసిన కల్యాణ వేంకటేశ్వర స్వామి శనివారం బంగారు తిరుచ్చిపై ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. వారపు ఉత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి నిత్యకైంకర్యాలు, అభిషేకాలు చేశారు. సాయంత్రం అలంకార భూషితుడైన స్వామివారు తన దేవేరులతో కలిసి బంగారు తిరుచ్చి వాహనాన్ని అధిష్టించి నాలుగు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.

సంబంధిత పోస్ట్