అప్పట్లో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంతకంతోనే సెకీతో ఒప్పందం కుదిరిందని వైఎస్సార్ సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపించారు. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలోని చెవిరెడ్డి స్వగృహంలో సోమవారం సాయంత్రం మీడియా సమావేశం పెట్టిన ఆయన మాట్లాడుతూ మీరు రెండు సార్లు మంత్రిగా పనిచేశారు, రెండు సార్లు సంతకాలు చేశారు. ఫార్వర్డ్ చేశాను అని చెప్పడం బాధాకరమని బాలినేనిని ఉద్దేశించి అన్నారు.