పాకాల: అభివృద్ధికి సూచికలుగా గుంతల రహిత రహదారులను ఏర్పాటు

50చూసినవారు
పాకాల: అభివృద్ధికి సూచికలుగా గుంతల రహిత రహదారులను ఏర్పాటు
చంద్రగిరి నియోజకవర్గంలో అభివృద్ధికి సూచికలుగా గుంతల రహిత రహదారులను ఏర్పాటు చేసేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. పాకాల మండలం ఇ-పాలగుట్టపల్లి పంచాయతీలోని శేషాపురం నుంచి గుంతలరహిత రహదారుల కార్యక్రమానికి వారు శనివారం భూమిపూజ చేశారు. ఎమ్మెల్యే నాని అధికారులతో సమన్వయం చేసుకుంటూ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్