చిత్తూరు: ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న ఆవుల తరలింపునకు చర్యలు

85చూసినవారు
చిత్తూరు పట్టణంలో రోడ్డుపై వాహనాలకు, ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న ఆవులను, ఎద్దులను మున్సిపల్ అధికారుల సహకారంతో గోశాలకు తరలిస్తున్నట్లు ట్రాఫిక్ సీఐ నిత్య బాబు శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆవు యజమానులను గుర్తించి వారికి జరిమానా విధిస్తామన్నారు. ఇప్పటికే రెండు సార్లు కౌన్సెలింగ్ ఇచ్చినప్పటికీ వారిలో ఎటువంటి మార్పు రాలేదన్నారు. యజమానులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్