చిత్తూరు పట్టణంలోని జడ్పీ సమావేశ మందిరంలో సమగ్రశిక్ష ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టీచింగ్ అట్ రైట్ లెవెల్ ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని జెసి విద్యాధరి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె తరల్ గోడపత్రికను అసిస్టెంట్ కలెక్టర్ హిమ వంశీ, డీఈవో వరలక్ష్మి, సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటరమణారెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్టేజ్ ప్రోగ్రాం కోఆర్డినేటర్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.