ఆగి ఉన్న కారును ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటన ఆదివారం గుడిపాల మండలం లో చోటుచేసుకుంది. చిత్తూరు నుండి వేలూరు కు వెళ్తున్న టీఎన్ 22 డిడి 1756 కారు ఓరియన్ ఫ్యాక్టరీ రోడ్డు వద్ద పక్కకు ఆగి ఉంది.అదే దారిలో వెళ్తున్న ద్విచక్ర వాహనం ఆగి ఉన్నకారును ఢీకొనడంతో ద్విచక్ర వాహనదారులు ప్రకాష్, కిరణ్ కు గయాలయ్యాయి. కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి.108 సిబ్బంది చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ లో తరలించారు.