ఫీజుల కోసం విద్యార్థులపై ఒత్తిడి తేవద్దు: చిత్తూరు కలెక్టర్
ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చేంత వరకు జూనియర్, డిగ్రీ కళాశాల యాజమాన్యులు విద్యార్థులపై ఒత్తిడి తేవద్దని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఆదేశించారు. ఫీజు రియంబర్స్మెంట్, మెస్ ఛార్జీలకు సంబంధించి నిధులు విడుదల అయ్యేంత వరకు యాజమాన్యులు ఓపిక వహించాలన్నారు. ప్రొఫెషనల్ కోర్సుకు సంబంధించి అధిక ఫీజులు వసూలు చేయరాదన్నారు. విద్యార్థులపై ఒత్తిడి తెచ్చే కళాశాల యాజమాన్యాలపై చర్యలు తప్పదని హెచ్చరించారు.