నాటుసారా విక్రయిస్తే చర్యలు తప్పదు: ఎక్సైజ్ సీఐ

77చూసినవారు
అక్రమంగా నాటు సారా విక్రయించినా, సరఫరా చేసినా కఠిన చర్యలు తప్పవని అర్బన్ ఎక్సైజ్ సీఐ శ్రీహరి రెడ్డి గురువారం హెచ్చరించారు. రాసనపల్లిలో నాటుసారా తయారీ కేంద్రాలు ఎక్కువగా ఉన్నాయని, వాటిపై ఉక్కు పాదం మోపుతామన్నారు. ప్రజలకు సమాచారం తెలిస్తే 9440902530 నంబర్ కు సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని, నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్