సీఎం చంద్రబాబుపై మోపిన స్కిల్ డెవలప్మెంట్ కేసుపై కూటమి ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్ బుధవారం డిమాండ్ చేశారు. ఆయన చిత్తూరులో మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుపై కక్షపూరితంగా అక్రమ కేసు బనాయించి 50 రోజులు జైల్లో పెట్టించారని అన్నారు. మానసికంగా హింసించారని తెలిపారు. దీనిపైన సమగ్ర విచారణ జరిపి దోషులు ఎవరో తేల్చాలని డిమాండ్ చేశారు.