
గంగాధర నెల్లూరు: నియోజకవర్గ వ్యాప్తంగా ఓ మోస్తరుగా వర్షం
గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో వాతావరణంలో వచ్చిన మార్పు కారణంగా ఆదివారం ఓ మోస్తరుగా వర్షం పడుతుంది. మారిన వాతావరణానికి తోడుగా చలి తీవ్రత కూడా విపరీతంగా ఉండడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రాలేకపోతున్నారు. ఒక్కసారిగా వర్షం రావడంతో దిక్కుతోచని స్థితిలో రైతులు ఉండిపోయారు. ఏది ఏమైనా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలియజేశారు.