ఉప ముఖ్యమంత్రి పై థామస్ ధ్వజం
చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు కూటమి అభ్యర్థి డాక్టర్ థామస్ కార్వేటినగరం మండలంలోని ఆయన స్వగ్రామమైన అల్లాగుంటలో సతీసమేతంగా శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రెండు రోజుల క్రితం ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అల్లాగుంటలో పర్యటించి తనపై చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో స్పందించారు. ప్రాంతం కానీ ప్రాంతానికి వచ్చి అల్లర్లు అరాచకాలతో ఎదిగిన నువ్వు నా గురించి మాట్లాడతావా అంటూ ధ్వజమెత్తారు.