కార్వేటి నగరం: బెల్లం ఊటను ధ్వంసం చేసిన పోలీసులు

54చూసినవారు
గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటినగరం మండలం, గోపిశెట్టిపల్లె సమీపంలో పొలాల్లో నాటు సారా తయారీ కోసం ఉంచిన పదార్థాలను ఆదివారం ఉదయం ఎస్సై రాజ్ కుమార్ నేతృత్వంలో ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశాల మేరకు ధ్వంసం చేశారు. ఎక్కడైనా నాటు సారా తయారీ అమ్మకాలు కొనసాగుతున్నట్లయితే తమకు సమాచారం ఇవ్వాలని ఎస్సై ప్రజలను కోరారు. చట్ట వ్యతిరేక పనులకు శిక్ష తప్పదని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్