చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం, నక్కలంపాలెం, యనమల మంద గ్రామాలలో అసిస్టెంట్ కమిషనర్ ప్రొహిబిషన్, జిల్లా ఎక్సైజ్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సోమవారం దాడులు నిర్వహించి 1400 లీటర్ల నాటు సారా ఊట ను ధ్వంసం చేసినట్లు ఎక్సైజ్ అధికారులు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎవరైనా నాటు సారాను తయారుచేసిన, విక్రయించిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.